26 డిసెంబర్, 2009

నేస్తం ...

" నీవుంటే వేరే కనులెందుకు ? నీ కంటే వేరే
బ్రతుకెందుకు ? "
నీ బాట లోని అడుగులు నావి
నా పాట లోని పదములు నీవి "
ఈ పాట వినే ఉంటారు " 'స్నేహం ''సినిమా లోది ఈ పాట .బాల్యానికి ,యవ్వనానికి మద్య స్తితి లో
ఈ సినిమా చుసిన జ్ఞాపకం .సినిమా కంటే ఈ పాట మనసులో ఎక్కడో దాగింది ..ఈ సినిమా కథ కంటే
ఈ పాట భావం ,మౌత్ ఆర్గాన్ తో వచ్చే రాగం మాటలో చెప్పలేని ఆత్మీయ భావన ,వేసవిలో చిరుజల్లు గా
మనసు తడి చేస్తది ..
నా ముందు గ నీవుంటే తొలిపొద్దు
నువ్వు చెంత గ లేకుంటే చీకటి ....
ఓ ఇద్దరి మద్య ఉండే స్నేహమో ,ఆత్మీయ భావనో ,ఇద్దర్లో ఒకరి లేమిని మరొకరు
భరింపలేని తనమో ,చెప్పే ఈ పాట బాలు గారి స్వరంలో వెన్నెల్లో జాజుల వాన లా మనసు
కు ఓ అపూర్వ భావన..
నీ చేయ్ తాకితే తీయని వెన్నెల
అలికిడి వింటేనే తొలకరి జల్లు ...
స్నేహ హస్తం తోడు ఉంటె ఎంతటి బాధ ఉన్నా , నేను ఉన్నా..అని నిండు గా
పలికే మనసు ఉంటె ...ఆ బంధం నిజం గా తొలకరి వెన్నెల ..కాదా ? ఈ పాట వినాలని ....

5 జూన్, 2009

నమో వెంకటేశా ...చిత్రం భళా రే ..కేతినేని కధ ......

'' నమో వెంకటేశా ...నా నమో తిరుమలేశా ...
మహానందమాయే ,ఓ మహా దేవ దేవా ... '' ఈ పాట వింటే అందరికి వేంకటేశుడు గుర్తొచ్చి భక్తీ పరవసులైతే నాకు మాత్రం మా ఊరి కేతినేని సినిమా హాల్ .ముందు పుల్ల ఐస్ తినడం ,నిన్న లా ఉంటే ,.'' చిత్రం భళా రే విచిత్రం ... వింటే అందరికీ మహానటుడు , రామారావు గారు దుర్యోధనుడి లా కన్పిస్తే నాకు మాత్రం ఎడ్ల బండి పోల్ లేస్తే ,పడి మూతి ,ముక్కు,చేతులు కు దెబ్బలు తిన్న మా కౌరవ సైన్యం అదే నండి.,మా జనాలు ..గుర్తొస్తే తెరలు తెరలు గా నవ్వు .ఇక్కడ ఓ మాట ..మా ఊర్లో అప్పుడు కేతినేని సినిమా హాల్ ఒకటే ఉండేది ఎక్కడెక్కడో ఉండే వాళ్లు ,ఊర్లో ఉండే వాళ్ళందరం ఎ సెలువులకు దసరా ,దీపావళి,సంక్రాంతి ,పెళ్లి ...గట్రా లలోమా వినోదం సినిమా ..ఇక వేసవి సెలవలైతే మాకు పండగలన్నీ ...మా ఇళ్ళకు రెండు కిలోమీటర్ ల దూరం మా కేతినేని సినిమా హాల్ మాకు ఇక్కడే samasya గంట ముందు బయల్దేరాలి ..నడవాలి మరి సినిమా కే బడ్జెట్ ,ఆటోలు లేవు ..గుంపంతా తయారై వెళ్ళాలి ..దార్లో మా మామయ్యా ఐస్ పార్లర్ ..లో ఐస్ లు ,,ఒకోకరు మూడు ,నాలుగు ..హాల్ట్ ఆయె సరికి అపుడు మొదలు "నమోవెంకటేసా...నా నమో తిరుమలేశా .." పాట అంటే టికట్లు మొదలన్నమాట ..ఇక పరుగో పరుగు అన్నీ సినిమా ముందు ఆ సంబరం ముందు బలాదూర్ ...సినిమా మొదలయేది చూడటం ,మద్యలో విశ్రాంతి లో ఏదో చక్రాలు .సోడా లు ,పీచు మిఠాయిలు ,,మళ్ళీ సినిమా మామూలే అందరికి ,సినిమా ముగిసీ సరికి శుభం అని తెల్సినా నాకు మాత్రం అరగంట ముందే భయం ..వెళ్ళేప్పుడు దార్లో మామిడిచెట్లు ...చీకటి పీరిగొయ్య మామిళ్ళు ..అంటే దెయ్యాల కు పేరు ,పగలు విన్న కతలన్నీ సినిమా శుభం ముందే నాకు దెయ్యాలు వాటి పిల్లలు కన్నుల్లో మెదిలి వణుకు రాప్పించేవి..అన్దరూ సినిమా హడావిడి లో ఉంటే నాకు భయం
తో సినిమా ఎక్కేది కాదు .. సినిమా అయేది .''.చిత్రం భళా రే విచిత్రం '' పాట మొదలు అంటే మా ఊర్లో అందరికి మొదటి
ఆట ఐపోఇనదని అర్ధం ...నాకు ఇప్పుడే చిత్రం భళారే మొదలు ,, నడక మొదలు మా గుంపంతా ..నేను మాత్రం ..
అందరి lo బిక్కు మంటూ ..నడవడం ,వాళ్ళంతా సినిమా కబుర్లు ,పాటలు .డాన్సులు ..వర్ణనలు ...ఓ పావుగంట నడక తర్వాత వచ్చేది ,నా భయానికి కారణమైన ,దయ్యాల తోట అప్పటికే రాత్రి పది అవుతది కాబట్టి,పల్లెటూరు మూలాన నిర్మానుష్యం గా ఉండే రోడ్లు.వీధి లైట్లు లేక చీకటి ..''.పీరిగొయ్య మామిళ్ళు తోపు '' నిజంగానే దెయ్యాల ఇల్లు లా ఉండేది ..అక్కడ కు రాగానే మా వాళ్ల లో అల్లరి వెధవలు దెయ్యం రో
అని గట్టిగా అరిచి పర్గుపెట్టేవాడు అంతే గుండెలు చేతిలో పెట్టుకుని పరుగో పరుగు ,అక్కడ మొదలైన పరుగు ఇంటికి వచ్చే దాక వణుకు ...ఇంట్లో తిట్లు ..నెమ్మదిగా అమ్మ అదిలింపు ..తో కుదుటపడి అన్నం తినడాలు మొదల పెడతాను ..అప్పుడు చెవుల్లో మళ్ళీ పడతది .."నమో వెంకటేశా ..నా నమో తిరుమలేశా ..."రెండో ఆట టిక్కట్లు మొదలు ...ఈ సినిమా ఎప్పుడు మారుతదా ..అని చూపులు మొదలు ...
ఇప్పటికి మా కేతినేని సినిమా హాల్ తలిస్తే ..ఆ పాట , ఆ పాట ఎక్కడ విన్నా ఆ సినిమా హాల్ ,లో ఉన్నా మదుర భావన , వెంటాడుతూనే ఉంది ..

2 జూన్, 2009

ఆ పరిమళానికి ఏది సాటి ? మల్లికలా? పారిజాతాలా?

వానా వల్లప్పా ...వాకిలి తిరుగు చెల్లప్పా ...

ఓ నాటి ముచ్చట .కాగితపు పడవలు...కన్నుల్లో మెదిల్తే , అలలు అలలుగా ఆలోచనలు .వానకోసం పసితనం నుండి మనషి పడే ఆరాటం, తపన ,ఆనందం లో ఈ సృష్టి లో ఉండే తరులు, విరులు.నింగి, నీళ్లు ,వీటి అన్నిటి తో పెంచుకున్న అనుబంధమో ,మమతో ,..ఈ తరం ,చదువులోమునకలేసి ,.బతుకు పోటి లో పరుగు లో అలిసి ఉన్నా ఈ పసితనం ,కి వాన ఆనందం ,తెలియదే అనే బాద ను పోయేలా ...మా బాబు ...నిన్న వాన కురిస్తే ,అమ్మా ..మట్టి వాసన బావుంది కదా ? విని ...మనసు పొంగిపోయింది . ఎంత కమ్మదనం ఆ మట్టి వాసన , ఎన్ని పరిమళాలు ,.చిన్న జల్లు కురిసి ,నేల తల్లిని తడపగానే ..ఆనందం తో పొంగే అమ్మ ..బిడ్డల కిచ్చే ,కానుక ఆ సుగంధమేమో ,ఎ కర్పూర పరిమళం ,సంపెంగ ల వాసన తో పోల్చ లేని ,కమ్మతనం , మట్టివాసన లో ఉంది ...

ఇంద్ర ధనుస్సు పల్లకి లో ...

మెరుపు కన్నెల చేయిపట్టి ...

చినుకు మల్లెల మూట కట్టి ...

మమతల వాన కురిపించి .....

మము బతికించే , నీ కోసం ఎన్ని ఎదురు చూపులు ...

వానా వల్లప్పా ...వాకిలి తిరుగు చెల్లప్పా ....అందుకే త్వరగా వచ్చేయ్.....నేను కచ్చితంగా నీకోసం ....నీ జల్లు పూల అభిషేకానికి ...వేచి ఉంటాను ... జలుబు ,జ్వరం అని తిట్టినా సరే....మళ్ళీ మళ్ళీ నీ కోసం .....

25 మే, 2009

పల్లె కన్నీరు పెడుతుందో ...కనిపించని కుట్రల .......

ఆకాసహర్మ్యాలు , అద్దాల రహదార్లు , అందాల వంతెనలు, ఏ కట్టడం వెనక చూసినా అక్కడ ఉండేది పాలమూరు కూలి , ఒక్క గుప్పెడు మెతుకుల కోసం రాళ్ళు పగిలే ఎండలో .కాళ్ళకు చెప్పులైనా లేక ,జోరున కురిసే వాన లో మట్టిలో మట్టిగా ,కలిసే మట్టి మనిషి పాలమూరు కూలి ...బొంబాయ్ ఐనా ,చెన్నపట్నం ఐనా ధ్యేయం ఒకటే , ఇక్కడ నేల తల్లిని బద్దలు కొట్టి ,కొండలు పిండి చేసి ,రాళ్ళు ముక్కలు చేసో మహారాజు అవడం కాదు ఒప్పుకున్నా పని పూర్తీ చేసే నిబద్దత , గుప్పెడు మెతుకుల ఆరాటం ,,ఎక్కడ ప్రమాదం జరిగినా ముందు కన్నీరు ఒలికేది పాలమూరు పల్లె కంట , ఆడ ,మగ , పదారేళ్ళ పసిపడుచులు ,ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ,మట్టిలో మట్టి గా కలిసి మనను ,చలవరాతి భవనాలలో ఉంచి ,మనప్రయాణాలకు., పూలరాదారులు వేసి, మన మాటలకు కేబుల్స్ వేసి , వాళ్లు మాత్రం ...స్వాతంత్ర్యం ..ఆనవాళ్ళు తెలియక ఇంకా బానిసలు గానే అదే మట్టిలో ,బ్రిడ్జి ల కింద,సమాధి అవుతూ ఉంటారు ...ఏమీ చేయలేని నిసహాయ రాలు గా కన్నీటి అంజలి నా పాలమూరు అమాయక బతుకులకు , కన్నీటి వందనాలు ,,పాలమూరు పల్లెలకు ,, వేల వందనాలు పాలమూరు తల్లులకు ...

20 మే, 2009

గోగులు పూచే గోగులుపూచే ఓ లచ్చా గుమ్మడి ...

పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మడి ...
పుత్తడి వెలుగులు కొత్తగ మెరిసే ఓ లచ్చ గుమ్మడి ....
ఆఫ్ పని మీద ఉదయమే బయల్దేరాను ...గోగులు .జనుము పొలాల్లో పసుపు పువ్వులతో కనువిందు ..గా ఉంది
ఎన్ని వర్ణాలు ఈ ప్రక్రుతి ఇచ్చింది ..బాధ్యతలో బతుకు తెరువో ,మన తో ఉండే అందాలు ఆనందాలు పోగొట్టుకుని
ఎక్కేడికో వెళ్తాము ..చిన్ననాటి చిక్కుడు పందిళ్ళ పూల వాసనలు , సాయం సంధ్యల్లో పూచే బీరపూలు ,వేసవి లో పలకరించే వేపపూలు ,ఎన్ని పరిమళాలు ,ఎన్ని అనుభూతులు ,.ప్రతి పూవుకు ఓ ప్రత్యెక పరిమళం .మనసులో నిండిపోతే ..ఇప్పటికీ ఆ చిక్కుడు పూల పరిమళం ,తలిస్తే మనసు కు సోకుతది..ఇప్పటి ఈ తరం పిల్లలకు ఈ పూల పరిమళం.ఈ ప్రక్రుతి తనకు తానుగా చిత్రించిన వర్ణాల తెలిదు..అందం ప్లాస్టిక్ పూల లో నో ...పూల కోట్ల లోనో పరిమితం .గా తెలుసు ..ఆ అనుభూతులు రావు కదా ...అనుకుంటే ..మనసు మూగపోతడి .
గోగులుపూచే గోగులు పూచే ఓ లచ్చా గుమ్మడి ..
గోగులు దులిపే వారేవా రమ్మా ...ఓ లచ్చా గుమ్మడి ....

19 మే, 2009

ఆ లోకయే శ్రీ బాలకృష్ణం...సఖీ ఆనందసుందర ....

మువ్వగోపాలుడు,ముద్దుక్రిష్ణుడు ,చిన్నికృష్ణుడు, కాదు కాదు కిట్టప్ప ..ఎంత అందాల రూపం ..

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ ,,

బంగారు మొలత్రాడు పట్టుదట్టి ...

బుజ్జికిట్టప్ప పద్యం తో మొదలైన నా చదువులో ,కిట్టుడో..మా ఉరికి దగ్గర లో ఉండే" నెమలి " మురళి ధరుడో నాకు అరాద్యం ..నెమలి కన్ను ,పిల్లంగోవి ..ఏది చూసినా ముందు కిట్టప్ప జ్ఞాపకం ..ఇక్కడ అద్వైత ,ద్వైతాలు తెలియని తనం .అర్దము అవసరం లేదు కాని ఆ రూపం .

సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం...

కింకిణీ జాల ఘణ ఘనిత కృష్ణం .....
అమ్మ గా ఓ కిట్టప్పను పెంచాను ...ఐనా మోహన రూపం బుజ్జి కృష్ణుడు అలంకారం లో ఎక్కడ ఎ ఫోటో చూసినా ..మైమఱపు ...
నంద సునందాది వందిత కృష్ణం ...
ఆనంద సుందర తాండవ కృష్ణం ......
ఆ కృష్ణ మాయలు .కృష్ణ గీతాలు .రచించి పరవసింపచేసిన మహా కవులకు వందనాలు ......

18 మే, 2009

గోదారల్లే .....ఎన్నెట్లో...గోదారల్లే ..ఎల్లువా గోదారల్లే .

గోదారి అంటే ఎంత ఇష్టమో , ఎంత పని వత్తిడి లో ఉన్నా గోదారి వైపు వెళ్తే ఆ నీళ్ళలో చూడపోతే మనసుకు ఏదో వెల్తి . ఆ నీటిలోని అలల రాగమో, నిశ్శబ్ద గీతమో నాలోకి ప్రవహించే ఓ భావన. అదో సాంత్వన ..అందుకే అడుగులు అటు కేసి తప్పక పడతాయేమో ..ఇక ఎన్నెట్లో గోదారో ..ఆ తెల్లని చల్లదనంలో ..నిశ్శబ్ద గోదారి చిరు అలలు ,పాదాల మువ్వల సవ్వడి. లా ,.ఆనందమో .భయమో , ఏదో తెలియని స్థితి , అభావన ,అచేతనాల ,మదుర భావం .ఇది మనిషికి ,మట్టికి ,మట్టిలో పుట్టే ప్రతి దానితో అనుబంధం పెనవేసుకునే మనసు మాయో తెలీదు ..ఈ మద్య నీళ్లు తగ్గిపోయాయంటే ఏదో దిగులు ,వెళ్ళలేదు ..ఈ వారం నీళ్లు వచ్చాయని ,,గోదారి కళ కళ గా ఉన్నదంటే ,,,ఏదో ఆనందం ..మనసు ఉప్పొంగింది ,,,గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే , ఎల్లువా గోదారల్లే ..ఎద లో ఏదో పాటా ....

13 మే, 2009

బంగారు తల్లీ ..వేల అంజలులు ....

ఈ రోజు ఏదో చానల్ ప్రసారం చేసిన ఓ వార్తా కథనం ....మనసు లో తడి కన్నుల్లో గంగ గోదారులు గా మారింది .. వరంగల్ లో రైలు పట్టాల్ దాటే ఓ వృద్దుడిని రక్షించే ప్రయత్నంలో ఓ యువతి మరణం ...ఎంత గొప్ప మనసు ఆ పసితనం లో నే ...నిస్తేజం గా పడి వున్నా ...ఆ మానవత్వపు చాయలు ..మరణం గా మిగిలాయి.. అని బాదపడాలో ...ఇంకా మన మనస్సులో మమతల తడి ,పోలేదని ..మానవత్వపు పరిమళాలు ..వాడని గీతలో...శిల్ప లో ...జన్మించాలని ...కోరాలో తెలియని స్థితి ...ఎంతో కాలం గా తెల్సిన వాళ్ళకే ఓ చిన్న సాయం చేయాలంటే పది సార్లు ఆలోచించే మేము ...ఎవరో తెలీని వ్యక్తీ కోసం ప్రాణాలు ఇచ్చిన ...నీ ధైర్యానికి ,త్యాగానికి ఏమి ఇవ్వగలం ? బంగారు తల్లీ వేల అంజలు ...లు తప్ప ..

29 ఏప్రిల్, 2009

ఓ మహాత్మా ....ఓ మహార్హీ .....శ్రీ .శ్రీ .....

ఓ మహాత్మా ....ఓ మహర్షీ ....శతకోటి ప్రణామాలు
అక్షరాలతో ఆటలాడి ,అక్షర లక్షల కవిత్వాన్ని
మాకిచ్చి ,పండిత పామర హృదయాల లో పాట గానో ..
కవితా కుసమలు గానో నిలిచిన మీకు ఏమివ్వగలం ?
" ఏదీ తనంత తానె నీ దరికి రాదు సోదించి సాదించాలి "
అన్న మీ పలుకుల్ని ఆదర్శం గా .".బతుకు కలకాదని,
విలువ లు తెల్సుకున్టూ" బతకడం ....తప్ప ...

నువ్వొస్తేనే ....

చైత్ర చివుళ్ళ ఊయల ఊగె కోకిలమ్మ .

వైశాఖపు కుహూ కొంటె పాటల కూనలమ్మ

ఏదుందొ తెలీని ఎదకు ఏ రాగం పాడినా

నీ నీడ ఐనా లెదు అనె కన్నులకు జోలపాడినా....

సంధ్యా చాయాల్లో విరిసే జాజికొమ్మ

జాబిలి జతలో పూచే వెన్నెలమ్మ ..

పూల పరిమళాల సందేశాలు పంపినా ...

ప్రేమ భావనా రాగాలు పాడినా ....

నువ్వొస్తేనే , మనసుకు వానవిల్లో

పులకింతల పూలజల్లో తెలిసేది ...

28 ఏప్రిల్, 2009

మల్లెపూవు ..మల్లెపూవు మెల్లగొచ్చి...గిల్లిఫో....

" మల్లెపూవు...మల్లెపూవు మెల్లగొచ్చి గిల్లిఫో "....ఎంత కమ్మదనం ..ఆ పదాల్లో.. చిన్నపిల్లలంటే పిచ్చేమో ..ఓ పదిమందితో ..." మల్లెపూవు..".అదేనండీ దాగుడుమూతలు ....కోలాహలం గా ఉందీ.వేసవిసెలవులు .. చీకటి వెలుగు కాని వాతావరణం ...వాసు ,అరుణ్.సింధు. శమీం. ప్రవీణ్ , కళ్లు మూయడం నా వంతు దాక్కోడాలు, . పట్టుకోడాలు వాల్లసంబరం ...ఇలా ఓ గంట గడిచాక ..వానవెలిసినట్టుగా ....మాయమైపోయారు. వాసుg వాళ్ల అమ్మొచ్చి బాబు ఉన్నాడా అనడం లేదని ,కంగారుగా వెదకడం మల్లీపిల్ల్లలు కూడటం వెదికితే ..ఓ అరగంట హైరానా తర్వాత ఇంటి పెరటి ప్రహరీ కి మద్య చిన్నక్రిష్ణుడు లా నిద్రపొతూ ..ముందు వాళ్ల అమ్మ నాన్న కంగారుపడ్డా తర్వాత అందర్లో నవ్వులు పువ్వులు గా ...సంగతి ఏమిటంటే అక్కడ దాక్కున్న వాడు ..అలసటతో అడమరుపో నిద్రపోయాడు...వాళ్ళతో ఆటలు వాళ్ల లేతబుగ్గలు గిల్లడాలు. , పూలు కోసివ్వదాలు..ఎనమిదో తొమ్మిదో ఏళ్ళు గడచినా.ఎప్పటికీ మరవలేని జ్ఞాపకం ఐతే ...అదే వాసు" శాశ్వత నిద్ర " పోయాడని EAMCET ఒత్తిడి కి బలి అయ్యాడని తెలిసి గుండె నీరయ్యింది ..ఆ వాసు అందరికి లేడేమో కాని వాడి లేత చెక్కిలి స్పర్శ, కళ్లు మూసిన నాచేతుల్లో ఉందీ. వాడి నవ్వు నన్ను వెంటాడుతూనే ఉందీ ...ఏమిటి చేస్తున్నామో మనం మన మల్లెల వంటి పిల్లల పట్ల ,,,, ఎక్కడో దాక్కున్న వాసూ ..మళ్ళీ రావని తెలుసు ఐనా"" మల్లెపువ్వు మల్లెపువ్వు మెల్లగొచ్చి గిల్లిఫో ."....

23 ఏప్రిల్, 2009

నెమలికన్నూ...నేనూ

చిన్నప్పుడు..ఆరు ,ఏడు తరగతుల్లో ...నెమలికన్ను { ఈక కాదు కన్ను} ఉంటే ఓ గొప్ప . ఎక్కడి నుండి ఐనా ఓ నెమలి కన్ను తెచ్చుకున్నామో ..ఇక అంతే వాళ్ల చుట్టూ ఆ పిల్లలూ ...అది పుస్తకాలో పెట్టి మళ్ళీ మళ్ళీ చూసుకోడం ..చూపడం...ఇక్కడో పసి నమ్మకం ..అది పిల్లలు పెడతదని ..పెడితే నీకోటిస్తా అని మాటివ్వదాలు...పిల్లలు పెట్టాలంటే ఏదో ఆహారం పెట్టాలి మరి? ఏమిటంటే తాటి ఆకుల మద్యలో ఉండే పీచు .. అది పెట్టక పిల్లల్ని పెట్టిందేమో అని ..ఎన్ని పెట్టిందో అని ..నిద్ర పోక ..{లేచి చూస్తె తంతారు మరి}... పొద్దుటే చూస్తె పిల్లా లేదు ...రేపు పెడతదని ..ఓ ఒనమ్మకం మళ్ళీ ... ఈ జ్ఞాపకం చాల అపూర్వం ......ఇప్పటికీ నాకు నెమలి కన్ను ..దాని పిల్లలూ కలలో వస్తాయండీ బాబు .....ఒకరు ఐనా నెమలికన్ను అనుబంధం పంచుకోండి......

వెన్నెల దీపం ........

వెన్నెల దీపం చేతపట్టుకుని కల ల వనాల లో నీకోసం వెదికితే వెలుగుపువ్వులా నువ్వు కనపడవేమి నేస్తం? .....ఎంత కాలం ఎంత దూరం వెళ్ళగలవు ?నువ్వు..నీ జ్ఞాపకాలూ....నా మనసు తోట లో ..మల్లికలు ,జాజులు ..గా పరిమళాలు వేదజల్లితే .....నీ జ్ఞాపకాలూ నాలో...గీతికలో...రాగాలో...ఆలాపిస్తే ? నువ్వు నాతో ఉన్నావనే నిశ్చింత ..నా నీ ప్రతి జ్ఞాపకం నా మనసుపుస్తకం లో అపూర్వమో..అపురూపమైన, పుట లు గా మిగిలితే....నువ్వు కన్పించకపోతే ఏమి? నా మనసులో....భావన గా , నా మమతలో....ఆర్గ్రత గా నాలోనే నాతో నే ఉంటావు....

22 ఏప్రిల్, 2009

నేను ఇండియన్ స్త్రీ ని....


  • నిశ్శబ్ద హిమానీ నది లా ...నాలో నేను ప్రవహిస్తున్నాను..... నా మనసును ,కలలను .నా నవ్వుల్ని , నా భావాలని ....... నా లోనే అణిచి వేసుకుంటూ.. నాలోని నన్ను మరిచిపోతూ ....... యుగాలు గా తరాలు గా ,వత్సరాలు గా పయనిస్తున్నాను.... గుండె గొంతుక లో సుడి తిరిగే మనోభావాల కెరటాలని ......... కన్నుల లోగిళ్ళలో కన్నీల్లుగా జారే జ్ఞాపకాల మాలికల్ని ..... కనుపాపల కాన్వాస్ ఫై కనురెప్పల కుంచెల తో...గీసిన చిత్రాలు ..కలతపడి చెదిరిన వర్ణాలు ఐనా జీవిత గమ్యాలు ... . నావి గా నేను గా వేసుకుంటూ మౌన తీరాలు దాటాలి అనే ఈ మనసుకు మమతల బంధాలు వేసి నాలోనే నేను గా మిగిలిన నేను ఎవరు? ఓ స్త్రీ ని ... మనసమాజపు స్త్రీ ని ..."భారతీయ మహిళా " ను....

నువ్వే నేనుగా .....

నేను నిర్లిప్తం గా మనోపుష్పం గుభాలించక ఉంటే ......నీ అల్లరి పాటలపల్లవులు నాలో...మోహన రాగాలు పాడిస్తాయ్ ....నేను మోడువారిన మొక్క లా ఉన్నపుడు .....నీ నవ్వుల పువ్వులు నాలో నవ వసంతాలు తెస్తే...,,, నేను చీకటి నిర్వేదం లో కొట్టుమిట్టాడితే ....నువ్వు ఎప్పుడో ఒకసారి నేను "ఉన్నాను" గా అన్న మాటలు గుర్తొస్తే,,,,ఉషస్సు గా వెలుగు తాను....

21 ఏప్రిల్, 2009

అమ్మా ...బియ్యం ఏ పిండితో.....?

మనసు రెక్కలు తెగిన పావురం లా vila విల లాడింది ...ఒక మొక్క ఐనా పుట్టని కాంక్రీట్ వనాలలో నెనూ ...జీవనం కొని సాగిస్తున్నప్పుడు ......అమ్మా ....బియ్యం ఎ పిండితో చేస్తారు? అని వాడు అడిగితే?.....మట్టి వాసన .విలువ తెలియక పెరిగే ఐ.q కు....కంప్యూటర్ .లో టీవీ ..లో...మిక్కి మౌస్ ల ....చిత్రాల్లో....ప్రాణం ఉన్నా చిత్తరువులు గా మారిన మన సన్నీ ..టింకూ లు...కు కోతి కొమ్మాచ్చి లు...వేన్నెల- గుడ్లు...తెలియక ...టాలెంట్ టెస్ట్ ల తో ఆడి అలిసిపోతే .....మనసు విల విల లాడింది....నేల తల్లిని కాన్వాస్ చేసి రోజుకో వర్ణ చిత్రాన్ని ముగ్గుగా మలచే మనం ...ఓ సంవత్సర కాలాన్ని ...ప్లాస్టిక్ చిత్రంగా మలచి అతికిస్తే ....మనసు రెక్కలు తెగిన పావురంలా ......కొట్టుకుంది....

ఓ రష్యా .....రచన

చిన్గిజ్ ఇత మాతోవ్...యు నేస్కో అంచనాలో అత్యధికంగా చదవబడిన రచయితల్లో ఒకరు ..అయన రచనలు అన్నీ మద్య ఆసియా మార్పులు ..చెప్తే....వాటిల్లో నాకు నచ్చినవి ..ఎవేరికినా నచ్చే సజీవ దృశ్యాలుగా మిగిలేవి... " తొలి ఉపాధ్యాయుడు'.. "తల్లి 'భూదేవి " నాటి కాలమాన స్థితులు ,సంస్కృతి ,వాల్లజీవేన విధానాలు ,ఒకప్పటి రష్యా ..యుద్ధ వాతావరణం. కన్నులకు కట్టే ....ఈ నవలల కు తెలుగు అనువాదం బావుంది ,,,ఒక్కసారినా చదివి ఆ నాటి ఓ ఉపాధ్యాయుదు ఓ సాధారణ బాలికను ఎంత ఉన్నత స్థితికి తీసుకు వచ్చి ,,విద్య విలువను ,,ఓ అనామక ప్రాంతంలో ...చెప్పి న విధం .కన్నులలో సజీవ చిత్రాలు గా నిలిచిపోతవి .....

20 ఏప్రిల్, 2009

ముద్దు మందారాలే .....


  1. "ముద్దుకే ముద్దొచ్చే మందారం. మువ్వల్లె నవ్వింది .. సింగారం" ఈ పాటలో చక్కని వర్ణన ....తెలుగింటి .మనింటి .పడుచుని మన పెరట్లో నో....మనింటి గోడపక్కనో పూచే ఎర్రమందారం తో పోల్చడం ...మన దేముడి మండపంలో ..కొలిచే దేముడి ముందు నిలిచే మందారం తో పోల్చడం .. ఒక్కసారంటే ఒక్కసారి ..వానముసురు లో అమ్మకోసమో .అమ్మమ్మకో కోసితెచ్చిన మురిపెపు ముద్దమందారం సోయగాలు గుర్తొస్తే..... .ఎక్కడో ఉన్నా మన ముగ్ద మందారం . పాలపసితనం పరికినికుచ్చిళ్ళు...ఉయాల గుర్తొస్తే పెరట్లో.మందారం చూడండి..........
. ..

మనసు కోసమే...

మల్లెలు...మరువము. మనువాడే మలిసంధ్య వేళ లో నీకోసం మౌన గీతం లా వేచి.. ఉంటే....రజని గంధాలు మోసుకొచ్చే చిరుగాలి నన్ను తాకి వెళ్ళినా .....మధు రవళుల మృదు సంగీతం ఏదో నను తట్టి పిలిచినా .ఈ మనసుకు నువ్వు వస్తేనే పరవసమో.....పరిమళమో....తెలిసేది...ఓ వెన్నెలా .....చల్లని తెల తెల్లని....నే మమతల పూలు వర్షిస్తేనే తెలిసేది ......నాలో మనసునదని.... ఈ గాలి...ఈ నీరు...ఈ ప్రకృతి....ఫై మమతల తడి పోలేదని....అందుకే వెన్నెలా వచ్చీ.ఫో... నన్ను నీ మృదు స్పర్స తో తడిపి వెళ్ళు.....నేను నువ్వు అయేంత గా....

19 ఏప్రిల్, 2009

పొగమంచు.. తెరలో....

ధనుర్మాసపు.. వాకిట్లో.. పసికలల ముగ్గులు వేసిన వేళ నువ్వు లేవు ......గోరంత pantala అరచేతి lo nuv లేవు..అమ్మ మమతల ఉయాల అట్లాతద్దుల్లోను... నువ్ లేవు.....ముద్ద బంతుల ముద్దు పూలజడ మురిపాల లో నువ్ లేవు...వన్నె వయసు వెన్నెల కార్తీకంలో... నువ్ లేవు....పసుపు చేమంతుల ధర హాసాల మద్య .పుష్య మాసపు సూర్యోదయం లాటి నవ్వు తో...ఇంకా తెరవని కిటికీ లో నుండి చొరవగా లోనికి వచ్చే పొగ మంచు లా నిశ్శబ్ద ప్రీమగీతమి ఎపుడు వచ్చావు...?

పారిజాతాలే అవి

నీ నవ్వులు నాలో వెన్నెల పూలు వెలుగు చిమ్మితే ...నీ నవ్వు నాలో సుమ గంధాలు చిలికితే.... నీ నవ్వు నాలో సాయం సంద్యా సమీరం లా పలకరిస్తే.. నా నువ్వు ఇచ్చే నీ నవ్వుల పారిజాతాలే ...నను అభిషేకిస్తే ....నీకు నమస్సుమాలు...

17 ఏప్రిల్, 2009

ఊరి లో...అడుగెడితే...

  • అలా వూరిలో..అడుగేట్టానా? బాలోత్సవ .. సంబర స్మృతి ఏదో నను తాకింది...తెల్లని...ముగ్గుపూల జావల్లీల వాకిళ్ళు...పచ్చని...బంతిపూల తోరణాల....గుమ్మాలు.... ఓ రాత్రి,,,దిప్పు దిప్పు దీపాలు....ఓ పగటి...దసరా సరదాలు....గుడి గంటల పసిభక్తి ఆరాటాలు... badigantala బతుకు పోరాటాలు.......కనురెప్పల కుంచెలతో...కనుపాపల కాన్వాస్ ఫై జ్ఞాపకాల వర్ణాలు అద్దితే... అలలు...అలలు..గా చిత్రాలే చిత్రాలు.వర్ణ ...చిత్రాలు...వెలa కట్టలేని.. . మళ్ళీ వేయలేని...బతుకు చిత్రాలు....