22 ఏప్రిల్, 2009

నేను ఇండియన్ స్త్రీ ని....


  • నిశ్శబ్ద హిమానీ నది లా ...నాలో నేను ప్రవహిస్తున్నాను..... నా మనసును ,కలలను .నా నవ్వుల్ని , నా భావాలని ....... నా లోనే అణిచి వేసుకుంటూ.. నాలోని నన్ను మరిచిపోతూ ....... యుగాలు గా తరాలు గా ,వత్సరాలు గా పయనిస్తున్నాను.... గుండె గొంతుక లో సుడి తిరిగే మనోభావాల కెరటాలని ......... కన్నుల లోగిళ్ళలో కన్నీల్లుగా జారే జ్ఞాపకాల మాలికల్ని ..... కనుపాపల కాన్వాస్ ఫై కనురెప్పల కుంచెల తో...గీసిన చిత్రాలు ..కలతపడి చెదిరిన వర్ణాలు ఐనా జీవిత గమ్యాలు ... . నావి గా నేను గా వేసుకుంటూ మౌన తీరాలు దాటాలి అనే ఈ మనసుకు మమతల బంధాలు వేసి నాలోనే నేను గా మిగిలిన నేను ఎవరు? ఓ స్త్రీ ని ... మనసమాజపు స్త్రీ ని ..."భారతీయ మహిళా " ను....

నువ్వే నేనుగా .....

నేను నిర్లిప్తం గా మనోపుష్పం గుభాలించక ఉంటే ......నీ అల్లరి పాటలపల్లవులు నాలో...మోహన రాగాలు పాడిస్తాయ్ ....నేను మోడువారిన మొక్క లా ఉన్నపుడు .....నీ నవ్వుల పువ్వులు నాలో నవ వసంతాలు తెస్తే...,,, నేను చీకటి నిర్వేదం లో కొట్టుమిట్టాడితే ....నువ్వు ఎప్పుడో ఒకసారి నేను "ఉన్నాను" గా అన్న మాటలు గుర్తొస్తే,,,,ఉషస్సు గా వెలుగు తాను....