25 మే, 2009

పల్లె కన్నీరు పెడుతుందో ...కనిపించని కుట్రల .......

ఆకాసహర్మ్యాలు , అద్దాల రహదార్లు , అందాల వంతెనలు, ఏ కట్టడం వెనక చూసినా అక్కడ ఉండేది పాలమూరు కూలి , ఒక్క గుప్పెడు మెతుకుల కోసం రాళ్ళు పగిలే ఎండలో .కాళ్ళకు చెప్పులైనా లేక ,జోరున కురిసే వాన లో మట్టిలో మట్టిగా ,కలిసే మట్టి మనిషి పాలమూరు కూలి ...బొంబాయ్ ఐనా ,చెన్నపట్నం ఐనా ధ్యేయం ఒకటే , ఇక్కడ నేల తల్లిని బద్దలు కొట్టి ,కొండలు పిండి చేసి ,రాళ్ళు ముక్కలు చేసో మహారాజు అవడం కాదు ఒప్పుకున్నా పని పూర్తీ చేసే నిబద్దత , గుప్పెడు మెతుకుల ఆరాటం ,,ఎక్కడ ప్రమాదం జరిగినా ముందు కన్నీరు ఒలికేది పాలమూరు పల్లె కంట , ఆడ ,మగ , పదారేళ్ళ పసిపడుచులు ,ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ,మట్టిలో మట్టి గా కలిసి మనను ,చలవరాతి భవనాలలో ఉంచి ,మనప్రయాణాలకు., పూలరాదారులు వేసి, మన మాటలకు కేబుల్స్ వేసి , వాళ్లు మాత్రం ...స్వాతంత్ర్యం ..ఆనవాళ్ళు తెలియక ఇంకా బానిసలు గానే అదే మట్టిలో ,బ్రిడ్జి ల కింద,సమాధి అవుతూ ఉంటారు ...ఏమీ చేయలేని నిసహాయ రాలు గా కన్నీటి అంజలి నా పాలమూరు అమాయక బతుకులకు , కన్నీటి వందనాలు ,,పాలమూరు పల్లెలకు ,, వేల వందనాలు పాలమూరు తల్లులకు ...

20 మే, 2009

గోగులు పూచే గోగులుపూచే ఓ లచ్చా గుమ్మడి ...

పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మడి ...
పుత్తడి వెలుగులు కొత్తగ మెరిసే ఓ లచ్చ గుమ్మడి ....
ఆఫ్ పని మీద ఉదయమే బయల్దేరాను ...గోగులు .జనుము పొలాల్లో పసుపు పువ్వులతో కనువిందు ..గా ఉంది
ఎన్ని వర్ణాలు ఈ ప్రక్రుతి ఇచ్చింది ..బాధ్యతలో బతుకు తెరువో ,మన తో ఉండే అందాలు ఆనందాలు పోగొట్టుకుని
ఎక్కేడికో వెళ్తాము ..చిన్ననాటి చిక్కుడు పందిళ్ళ పూల వాసనలు , సాయం సంధ్యల్లో పూచే బీరపూలు ,వేసవి లో పలకరించే వేపపూలు ,ఎన్ని పరిమళాలు ,ఎన్ని అనుభూతులు ,.ప్రతి పూవుకు ఓ ప్రత్యెక పరిమళం .మనసులో నిండిపోతే ..ఇప్పటికీ ఆ చిక్కుడు పూల పరిమళం ,తలిస్తే మనసు కు సోకుతది..ఇప్పటి ఈ తరం పిల్లలకు ఈ పూల పరిమళం.ఈ ప్రక్రుతి తనకు తానుగా చిత్రించిన వర్ణాల తెలిదు..అందం ప్లాస్టిక్ పూల లో నో ...పూల కోట్ల లోనో పరిమితం .గా తెలుసు ..ఆ అనుభూతులు రావు కదా ...అనుకుంటే ..మనసు మూగపోతడి .
గోగులుపూచే గోగులు పూచే ఓ లచ్చా గుమ్మడి ..
గోగులు దులిపే వారేవా రమ్మా ...ఓ లచ్చా గుమ్మడి ....

19 మే, 2009

ఆ లోకయే శ్రీ బాలకృష్ణం...సఖీ ఆనందసుందర ....

మువ్వగోపాలుడు,ముద్దుక్రిష్ణుడు ,చిన్నికృష్ణుడు, కాదు కాదు కిట్టప్ప ..ఎంత అందాల రూపం ..

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ ,,

బంగారు మొలత్రాడు పట్టుదట్టి ...

బుజ్జికిట్టప్ప పద్యం తో మొదలైన నా చదువులో ,కిట్టుడో..మా ఉరికి దగ్గర లో ఉండే" నెమలి " మురళి ధరుడో నాకు అరాద్యం ..నెమలి కన్ను ,పిల్లంగోవి ..ఏది చూసినా ముందు కిట్టప్ప జ్ఞాపకం ..ఇక్కడ అద్వైత ,ద్వైతాలు తెలియని తనం .అర్దము అవసరం లేదు కాని ఆ రూపం .

సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం...

కింకిణీ జాల ఘణ ఘనిత కృష్ణం .....
అమ్మ గా ఓ కిట్టప్పను పెంచాను ...ఐనా మోహన రూపం బుజ్జి కృష్ణుడు అలంకారం లో ఎక్కడ ఎ ఫోటో చూసినా ..మైమఱపు ...
నంద సునందాది వందిత కృష్ణం ...
ఆనంద సుందర తాండవ కృష్ణం ......
ఆ కృష్ణ మాయలు .కృష్ణ గీతాలు .రచించి పరవసింపచేసిన మహా కవులకు వందనాలు ......

18 మే, 2009

గోదారల్లే .....ఎన్నెట్లో...గోదారల్లే ..ఎల్లువా గోదారల్లే .

గోదారి అంటే ఎంత ఇష్టమో , ఎంత పని వత్తిడి లో ఉన్నా గోదారి వైపు వెళ్తే ఆ నీళ్ళలో చూడపోతే మనసుకు ఏదో వెల్తి . ఆ నీటిలోని అలల రాగమో, నిశ్శబ్ద గీతమో నాలోకి ప్రవహించే ఓ భావన. అదో సాంత్వన ..అందుకే అడుగులు అటు కేసి తప్పక పడతాయేమో ..ఇక ఎన్నెట్లో గోదారో ..ఆ తెల్లని చల్లదనంలో ..నిశ్శబ్ద గోదారి చిరు అలలు ,పాదాల మువ్వల సవ్వడి. లా ,.ఆనందమో .భయమో , ఏదో తెలియని స్థితి , అభావన ,అచేతనాల ,మదుర భావం .ఇది మనిషికి ,మట్టికి ,మట్టిలో పుట్టే ప్రతి దానితో అనుబంధం పెనవేసుకునే మనసు మాయో తెలీదు ..ఈ మద్య నీళ్లు తగ్గిపోయాయంటే ఏదో దిగులు ,వెళ్ళలేదు ..ఈ వారం నీళ్లు వచ్చాయని ,,గోదారి కళ కళ గా ఉన్నదంటే ,,,ఏదో ఆనందం ..మనసు ఉప్పొంగింది ,,,గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే , ఎల్లువా గోదారల్లే ..ఎద లో ఏదో పాటా ....

13 మే, 2009

బంగారు తల్లీ ..వేల అంజలులు ....

ఈ రోజు ఏదో చానల్ ప్రసారం చేసిన ఓ వార్తా కథనం ....మనసు లో తడి కన్నుల్లో గంగ గోదారులు గా మారింది .. వరంగల్ లో రైలు పట్టాల్ దాటే ఓ వృద్దుడిని రక్షించే ప్రయత్నంలో ఓ యువతి మరణం ...ఎంత గొప్ప మనసు ఆ పసితనం లో నే ...నిస్తేజం గా పడి వున్నా ...ఆ మానవత్వపు చాయలు ..మరణం గా మిగిలాయి.. అని బాదపడాలో ...ఇంకా మన మనస్సులో మమతల తడి ,పోలేదని ..మానవత్వపు పరిమళాలు ..వాడని గీతలో...శిల్ప లో ...జన్మించాలని ...కోరాలో తెలియని స్థితి ...ఎంతో కాలం గా తెల్సిన వాళ్ళకే ఓ చిన్న సాయం చేయాలంటే పది సార్లు ఆలోచించే మేము ...ఎవరో తెలీని వ్యక్తీ కోసం ప్రాణాలు ఇచ్చిన ...నీ ధైర్యానికి ,త్యాగానికి ఏమి ఇవ్వగలం ? బంగారు తల్లీ వేల అంజలు ...లు తప్ప ..