3 నవంబర్, 2010

మనసున్న కనులుంటే

అంతా నిద్రలో....
ఆకాసదీపాలు,..అల్లరి మేఘాలు..నిశబ్ద రాగాలు
అంతా నిద్ర లో..
నేను నీ కోసం
"ముందు తెలిసేనా ప్రభూ .. ఈ మందిరం ఇటులున్డేనా"?
నీ కోసం వెదికితే తెల్సింది కిట్టప్పా...మనసున్న కనులుంటే ప్రతిచోటా మధుమాసం అని
నా కనులకి మనసుంది
నా మమతకి మనసుంది
నా మనసుకి మనసుంది .. అని ..
మనసు భాష్యం
మమత భావం..తెలిసి ఝరి లో తడిసి
phoenix లా కాలి పరుగు తీస్తే
మళ్ళీ జన్మకు ...అర్ధం తెల్సింది...శిశిరం ..వాసంతం అందం లో అర్ధం
తెల్సింది ..

2 నవంబర్, 2010

ఎవరికి ఎవరో

అంతా నిద్రలో ..
నేను నీ కోసం.".బ్రతుకంతాఎదురుచూపు పట్టున రానేరావు
ఎదురగని వేళ వచ్చి యిట్టె మాయమైతావు
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగా
నీపదముల బందించ గ లేను హృదయం సంకెలచేసి...