3 నవంబర్, 2010

మనసున్న కనులుంటే

అంతా నిద్రలో....
ఆకాసదీపాలు,..అల్లరి మేఘాలు..నిశబ్ద రాగాలు
అంతా నిద్ర లో..
నేను నీ కోసం
"ముందు తెలిసేనా ప్రభూ .. ఈ మందిరం ఇటులున్డేనా"?
నీ కోసం వెదికితే తెల్సింది కిట్టప్పా...మనసున్న కనులుంటే ప్రతిచోటా మధుమాసం అని
నా కనులకి మనసుంది
నా మమతకి మనసుంది
నా మనసుకి మనసుంది .. అని ..
మనసు భాష్యం
మమత భావం..తెలిసి ఝరి లో తడిసి
phoenix లా కాలి పరుగు తీస్తే
మళ్ళీ జన్మకు ...అర్ధం తెల్సింది...శిశిరం ..వాసంతం అందం లో అర్ధం
తెల్సింది ..

2 నవంబర్, 2010

ఎవరికి ఎవరో

అంతా నిద్రలో ..
నేను నీ కోసం.".బ్రతుకంతాఎదురుచూపు పట్టున రానేరావు
ఎదురగని వేళ వచ్చి యిట్టె మాయమైతావు
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగా
నీపదముల బందించ గ లేను హృదయం సంకెలచేసి...



6 సెప్టెంబర్, 2010

నాలో నేనే.



14 ఏప్రిల్, 2010

పట్టి తెచ్చాను లే పండు వెన్నెల్ని నేనే ...

ఒకటంటే ఒకటి .....
నువొచ్చే వేళ వాసంత కోకిల కుహూ రాగం ...
నువొచ్చే వేళ జాబిలీ దీపపు వెలుగు నీడలామౌనం
నువొచ్చే వేళ అల్లరి మల్లెల పరిమళాలు ...
నువొచ్చే వేళ చిరుగాలుల పరవసo గానాలు ..
నను నిలవనేయక పొతే .....
నేను నీకోసం ....పట్టితెచ్చాను లే పండు వెన్నెల్ని నేనే ...
ఒకసారంటే
ఒకసారి .....
నీ కోసం నా కనురెప్పల కుంచెల తో ...నీ కను పాపల పై గీసే అనుభూతుల వర్ణ చిత్రాలు ...వీక్షించ్మని...