25 మే, 2009

పల్లె కన్నీరు పెడుతుందో ...కనిపించని కుట్రల .......

ఆకాసహర్మ్యాలు , అద్దాల రహదార్లు , అందాల వంతెనలు, ఏ కట్టడం వెనక చూసినా అక్కడ ఉండేది పాలమూరు కూలి , ఒక్క గుప్పెడు మెతుకుల కోసం రాళ్ళు పగిలే ఎండలో .కాళ్ళకు చెప్పులైనా లేక ,జోరున కురిసే వాన లో మట్టిలో మట్టిగా ,కలిసే మట్టి మనిషి పాలమూరు కూలి ...బొంబాయ్ ఐనా ,చెన్నపట్నం ఐనా ధ్యేయం ఒకటే , ఇక్కడ నేల తల్లిని బద్దలు కొట్టి ,కొండలు పిండి చేసి ,రాళ్ళు ముక్కలు చేసో మహారాజు అవడం కాదు ఒప్పుకున్నా పని పూర్తీ చేసే నిబద్దత , గుప్పెడు మెతుకుల ఆరాటం ,,ఎక్కడ ప్రమాదం జరిగినా ముందు కన్నీరు ఒలికేది పాలమూరు పల్లె కంట , ఆడ ,మగ , పదారేళ్ళ పసిపడుచులు ,ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ,మట్టిలో మట్టి గా కలిసి మనను ,చలవరాతి భవనాలలో ఉంచి ,మనప్రయాణాలకు., పూలరాదారులు వేసి, మన మాటలకు కేబుల్స్ వేసి , వాళ్లు మాత్రం ...స్వాతంత్ర్యం ..ఆనవాళ్ళు తెలియక ఇంకా బానిసలు గానే అదే మట్టిలో ,బ్రిడ్జి ల కింద,సమాధి అవుతూ ఉంటారు ...ఏమీ చేయలేని నిసహాయ రాలు గా కన్నీటి అంజలి నా పాలమూరు అమాయక బతుకులకు , కన్నీటి వందనాలు ,,పాలమూరు పల్లెలకు ,, వేల వందనాలు పాలమూరు తల్లులకు ...