2 జూన్, 2009

ఆ పరిమళానికి ఏది సాటి ? మల్లికలా? పారిజాతాలా?

వానా వల్లప్పా ...వాకిలి తిరుగు చెల్లప్పా ...

ఓ నాటి ముచ్చట .కాగితపు పడవలు...కన్నుల్లో మెదిల్తే , అలలు అలలుగా ఆలోచనలు .వానకోసం పసితనం నుండి మనషి పడే ఆరాటం, తపన ,ఆనందం లో ఈ సృష్టి లో ఉండే తరులు, విరులు.నింగి, నీళ్లు ,వీటి అన్నిటి తో పెంచుకున్న అనుబంధమో ,మమతో ,..ఈ తరం ,చదువులోమునకలేసి ,.బతుకు పోటి లో పరుగు లో అలిసి ఉన్నా ఈ పసితనం ,కి వాన ఆనందం ,తెలియదే అనే బాద ను పోయేలా ...మా బాబు ...నిన్న వాన కురిస్తే ,అమ్మా ..మట్టి వాసన బావుంది కదా ? విని ...మనసు పొంగిపోయింది . ఎంత కమ్మదనం ఆ మట్టి వాసన , ఎన్ని పరిమళాలు ,.చిన్న జల్లు కురిసి ,నేల తల్లిని తడపగానే ..ఆనందం తో పొంగే అమ్మ ..బిడ్డల కిచ్చే ,కానుక ఆ సుగంధమేమో ,ఎ కర్పూర పరిమళం ,సంపెంగ ల వాసన తో పోల్చ లేని ,కమ్మతనం , మట్టివాసన లో ఉంది ...

ఇంద్ర ధనుస్సు పల్లకి లో ...

మెరుపు కన్నెల చేయిపట్టి ...

చినుకు మల్లెల మూట కట్టి ...

మమతల వాన కురిపించి .....

మము బతికించే , నీ కోసం ఎన్ని ఎదురు చూపులు ...

వానా వల్లప్పా ...వాకిలి తిరుగు చెల్లప్పా ....అందుకే త్వరగా వచ్చేయ్.....నేను కచ్చితంగా నీకోసం ....నీ జల్లు పూల అభిషేకానికి ...వేచి ఉంటాను ... జలుబు ,జ్వరం అని తిట్టినా సరే....మళ్ళీ మళ్ళీ నీ కోసం .....