19 మే, 2009

ఆ లోకయే శ్రీ బాలకృష్ణం...సఖీ ఆనందసుందర ....

మువ్వగోపాలుడు,ముద్దుక్రిష్ణుడు ,చిన్నికృష్ణుడు, కాదు కాదు కిట్టప్ప ..ఎంత అందాల రూపం ..

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ ,,

బంగారు మొలత్రాడు పట్టుదట్టి ...

బుజ్జికిట్టప్ప పద్యం తో మొదలైన నా చదువులో ,కిట్టుడో..మా ఉరికి దగ్గర లో ఉండే" నెమలి " మురళి ధరుడో నాకు అరాద్యం ..నెమలి కన్ను ,పిల్లంగోవి ..ఏది చూసినా ముందు కిట్టప్ప జ్ఞాపకం ..ఇక్కడ అద్వైత ,ద్వైతాలు తెలియని తనం .అర్దము అవసరం లేదు కాని ఆ రూపం .

సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం...

కింకిణీ జాల ఘణ ఘనిత కృష్ణం .....
అమ్మ గా ఓ కిట్టప్పను పెంచాను ...ఐనా మోహన రూపం బుజ్జి కృష్ణుడు అలంకారం లో ఎక్కడ ఎ ఫోటో చూసినా ..మైమఱపు ...
నంద సునందాది వందిత కృష్ణం ...
ఆనంద సుందర తాండవ కృష్ణం ......
ఆ కృష్ణ మాయలు .కృష్ణ గీతాలు .రచించి పరవసింపచేసిన మహా కవులకు వందనాలు ......

4 కామెంట్‌లు:

  1. అవ్యక్తమైన భావనలో మునిగిపోయాను, మీ కొన్ని టపాలు చదివి [Apr 23 - To Date]. మళ్ళీ తీరిక చిక్కాక వస్తాను. మిగిలినవి చదువుతాను. మీ వ్యాఖ్య ద్వారా మీ బ్లాగుని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. ఉష గారికి
    నా టపా ల పై మీ స్పనదన కు
    ధన్యవాదాలు .. స్వాగతం..

    రిప్లయితొలగించండి
  3. చిన్ని గారు
    మీ నవ్వు చాలా బావుంది .
    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి