23 ఏప్రిల్, 2009

వెన్నెల దీపం ........

వెన్నెల దీపం చేతపట్టుకుని కల ల వనాల లో నీకోసం వెదికితే వెలుగుపువ్వులా నువ్వు కనపడవేమి నేస్తం? .....ఎంత కాలం ఎంత దూరం వెళ్ళగలవు ?నువ్వు..నీ జ్ఞాపకాలూ....నా మనసు తోట లో ..మల్లికలు ,జాజులు ..గా పరిమళాలు వేదజల్లితే .....నీ జ్ఞాపకాలూ నాలో...గీతికలో...రాగాలో...ఆలాపిస్తే ? నువ్వు నాతో ఉన్నావనే నిశ్చింత ..నా నీ ప్రతి జ్ఞాపకం నా మనసుపుస్తకం లో అపూర్వమో..అపురూపమైన, పుట లు గా మిగిలితే....నువ్వు కన్పించకపోతే ఏమి? నా మనసులో....భావన గా , నా మమతలో....ఆర్గ్రత గా నాలోనే నాతో నే ఉంటావు....

1 కామెంట్‌:

  1. మంజులనాధం వినిపించడం లేదేమి రిషిపాప గారు ...నిశబ్ద నిశీధిలో సుషుప్తావస్తలో వున్నారా ?
    జ్ఞాపకాల పరిమళ లలో .....చిన్ని.

    రిప్లయితొలగించండి