23 ఏప్రిల్, 2009

నెమలికన్నూ...నేనూ

చిన్నప్పుడు..ఆరు ,ఏడు తరగతుల్లో ...నెమలికన్ను { ఈక కాదు కన్ను} ఉంటే ఓ గొప్ప . ఎక్కడి నుండి ఐనా ఓ నెమలి కన్ను తెచ్చుకున్నామో ..ఇక అంతే వాళ్ల చుట్టూ ఆ పిల్లలూ ...అది పుస్తకాలో పెట్టి మళ్ళీ మళ్ళీ చూసుకోడం ..చూపడం...ఇక్కడో పసి నమ్మకం ..అది పిల్లలు పెడతదని ..పెడితే నీకోటిస్తా అని మాటివ్వదాలు...పిల్లలు పెట్టాలంటే ఏదో ఆహారం పెట్టాలి మరి? ఏమిటంటే తాటి ఆకుల మద్యలో ఉండే పీచు .. అది పెట్టక పిల్లల్ని పెట్టిందేమో అని ..ఎన్ని పెట్టిందో అని ..నిద్ర పోక ..{లేచి చూస్తె తంతారు మరి}... పొద్దుటే చూస్తె పిల్లా లేదు ...రేపు పెడతదని ..ఓ ఒనమ్మకం మళ్ళీ ... ఈ జ్ఞాపకం చాల అపూర్వం ......ఇప్పటికీ నాకు నెమలి కన్ను ..దాని పిల్లలూ కలలో వస్తాయండీ బాబు .....ఒకరు ఐనా నెమలికన్ను అనుబంధం పంచుకోండి......

6 కామెంట్‌లు:

  1. నాకూ ఈ నెమలికన్ను ... పిల్లలు ...మేత ...అనుభవమేనండీ ! ఇప్పటికీ ఇష్టమే ..కొందరు పెట్టుకోకూడదన్నా ఇంట్లో నేమలీకలు పెట్టుకున్నా :) :)

    రిప్లయితొలగించండి
  2. మేము కూడా చిన్నప్పుడు ఇలానే చేసేవాళ్ళం ....బ్రోవన్ కలర్ పొడి తాటి ఆకులనుండి సేకరించి నెమలి ఈకలకు ఆహారం పెట్టేవాళ్ళం ....ప్రతి ఒక్కరు భాల్యం లో ఇలానే ప్రవర్తిస్తారేమో ....మీవి నెమలికన్ను బ్లాగ్ నుండి చూసాను ...బాగా రాసారు .నాకుల కొంచెం అచ్చు తప్పులు వున్నాయి.

    రిప్లయితొలగించండి
  3. బాగుందండి.. మీరూ నాలాగే అన్నమాట..

    రిప్లయితొలగించండి
  4. హమ్మయ్య ...ఇన్నాళ్ళకు నా నెమలికన్ను పిల్లలుపెట్టినంత అనందం వెసింది.మీ స్పందనకు .

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగుంది మీ నెమలి కన్ను కథ. నేను చిన్నప్పుడు అలానే చేసేదానిని. నేను కూడా ఆ నెమలి కన్నుతో అనుభందం మర్చి పోలేక పరిమళ గారిలానే ఇప్పటీకి మా ఈంటి నిండా నెమలి పించాలు పెట్టుకుంటా. నా లాంటి పిచ్చోళ్ళు చాలామందే వున్నరన్నమాట.

    రిప్లయితొలగించండి
  6. నెమలికన్ను .పై మీ స్పందనకు ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి